BARTRUHARI SUBHASHITAMULU భర్తృహరి శుభాషితములు సవ్యాఖ్యానా సహితము


Price: [price_with_discount]
(as of [price_update_date] – Details)


[ad_1]
భర్తృహరి సుభాషితములు – భాగవతుల సుబ్రహ్మణ్యం భర్తృహరి రెండు ప్రభావవంతమైన సంస్కృత గ్రంథాలు రచించిన సంస్కృత కవి. ఇతను 5వ శతాబ్దానికి చెందినవాడు. భర్తృహరి సుభాషితాలు ప్రతివాడు చదవాల్సిన పుస్తకం. మన పూర్వీకులకు చాలామందికి ఇందులో చాలా పద్యాలు కంఠతా వచ్చు. కొన్ని అద్భుతమైన పద్యాలు ఉన్నాయి ఈ సుభాషితాల్లో. నాకు బాగా నచ్చినవి. తే.గీ. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు దివిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! అర్థం: ఇసుకను పిండి నూనె తీయవచ్చు ఎండమావిలో నీరు తాగవచ్చు కుందేటి కొమ్ము సాధించవచ్చు కానీ మూర్ఖుల మనసు రంజింపరాదు. మూర్ఖులకు వివరించడం ఎంత కష్టమో చెపుతోంది. భారతంవంటి ఢర్మ గ్రంధాలలో కనిపించే ఈ సూక్తులు లేదా సుభాషితాలు ఒక్కచోట ఏర్చి కూర్చడం లోనే భతృహరి ప్రజ్ఞ ఇమిడివుంది. ఇలాంటి విషయాల్ని అద్భుతంగా, చమత్కారంగా చెప్పడంలో వారికి వారే సాటి. అలాటి భతృహరి మహాకవి గారు సుభాషితాలకి పామరులకు కూడా అర్ధమయ్యేలా వ్యాఖ్యానం చేశారు భాగవతుల సుబ్రహ్మణ్యం. మరీ ముఖ్యంగా, జీవిత సత్యాలను ఎంతో గొప్పగా, చాలా బాగా వినసొంపుగా సెలవిచ్చారు భతృహరి. అందుకు తగ్గట్టు, భాగవతుల సుబ్రహ్మణ్యం గారు మరింత సులువుగా అర్ధం వివరించారు అన్ని శ్లోకాలకీ. మన భవిష్యత్తరాల వారు ఉన్నత స్థాయిలో ఉండాలంటే, ఉత్తములుగా ఎదగాలంటే ఈ పుస్తకం చదివితీరాలి. పెద్దలు చదివిచేలా చూడాలి. ఏది ఏమైనాగతి తప్పుతున్న సమాజానికి ఈసుభాషితాల అవసరం నిరంతరం ఉంటూనేవుంటుంది. ఈ సుభాషితాలు అన్ని కాలాలలోనూ, అందరికీ వర్తిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

ASIN ‏ : ‎ B09B5FKW3R
Publisher ‏ : ‎ navaratnabookhouse (1 January 2013)
Language ‏ : ‎ Telugu
Hardcover ‏ : ‎ 432 pages
Item Weight ‏ : ‎ 400 g
Dimensions ‏ : ‎ 22.3 x 14.3 x 2.5 cm
Country of Origin ‏ : ‎ India
Net Quantity ‏ : ‎ 1.00 count

[ad_2]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top